calender_icon.png 28 October, 2024 | 10:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ రంగారెడ్డి జాయింట్ కలెక్టర్

13-08-2024 11:54:36 AM

రంగారెడ్డి: లంచం తీసుకుంటూ పట్టుబడిన రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లోని జాయింట్ కలెక్టర్, సీనియర్ అసిస్టెంట్ మంగళవారం ఏసీబీకి చిక్కారు. ఏసీబీకి చిక్కిన రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెర్టర్ భూపాల్ రెడ్డి, సీనియర్ అసిస్టెంట్ మదన్ మోహన్ రెడ్డి భూ లావదేవీలో భాగంగా ధరణిలో నిషేధిత జాబితా నుంచి భూమిని తొలగించేందుకు ఓ రైతు రూ.8 లక్షలు డిమాండ్ చేశారు. దీంతో రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.

అధికారులు చాక చాక్యంగా వ్యవహరించి సీనియర్ అసిస్టెంట్ రైతు నుంచి 8 లక్షలు లంచం తీసుకుని జిల్లా అదపు కలెక్టర్ భూపాల్ రెడ్డి ఇస్తుండగా రెడ్ హ్యాండ్ గా పట్టుకున్నారు. బండ్లగూడ-నాగోల్ సమీపంలోని రంగారెడ్డి జాయింట్ కలెక్టర్ భూపాల్ రెడ్డి ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించి రూ.16 లక్షల నగదు, కీలకమైన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఏసీబీ అధికారులు ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

 ఉలికి పడిన కలెక్టర్ కార్యాలయం...

అదనపు కలెక్టర్ ఏసీబీకి ట్రాప్ అయ్యాడనే విషయం వెలుగు చూడటంతో పలువురు రెవెన్యూ అధికారుల గుండెల్లో రైళ్ళు పరుగెడుతున్నాయి.  అయా శాఖల అధికారులతో పాటు జిల్లాలో ఇట్టి విషయం చర్చనీయాంశమైంది. సాక్షాతు జాయింట్ కలెక్టరే ఏసీబీకి చిక్కిన అందరినీ నివ్వెరపోయేలా చేసింది