calender_icon.png 31 March, 2025 | 12:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బిల్లులు చెల్లించమంటే అరెస్ట్ చేస్తారా.. ఇదెక్కడి న్యాయం

27-03-2025 02:28:49 PM

హుజురాబాద్,విజయక్రాంతి: బిల్లులు చెల్లించమంటే ఏ ప్రభుత్వంలో చేశారని అరెస్టు చేస్తున్నారు. ఇది ఎక్కడి న్యాయం అని రంగాపూర్ తాజా మాజీ సర్పంచ్ బింగి కరుణాకర్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. కరీంనగర్ జిల్లా(Karimnagar District) హుజూరాబాద్ మండలం రంగాపూర్ గ్రామానికి చెందిన తాజా మాజీసర్పంచ్ బింగీ కరుణాకర్ ని గురువారం ఉదయం  ప్రాతకాలా పూజ టైంలో అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. సుమారు 25 లక్షల పెండింగ్ బిల్లులు రావాలని ప్రభుత్వాన్ని అడిగితే ఏ ముఖ్యమంత్రి కాలంలో పనులు చేశారని అడుగుతున్నారని, అదే ప్రభుత్వంలో దాదాపు 2000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించారని అన్నారు. 

ఇది ప్రజా ప్రభుత్వమా ప్రజల హక్కులను కాలరాసే  ప్రభుత్వం అని ప్రశ్నించారు. అదే పెద్ద కాంట్రాక్టర్లు అయితే కమిషన్లు ఇస్తున్నారని బిల్లులు ఇస్తున్నారా అని ప్రశ్నించారు. చిన్న కాంట్రాక్టర్లు కమిషన్లు ఇచ్చుకోలేరని పనిచేసిన వాటికి బిల్లులు అడుగుతే నెలకు మూడు   పర్యాయాలుఅరెస్టులు చేస్తూ సమయ భావాన్ని వృధా చేస్తూ మాజీసర్పంచులనుమానసికంగా ఒత్తిళ్లకు గురి చేస్తున్నారని  ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కెసిఆర్(Kalvakuntla Chandrashekar Rao) కు ప్రజల ఎలాంటి బుద్ధి చెప్పారు.

రేవంత్ రెడ్డి(Revanth Reddy) కూడా అదే గతి పడుతుందని హెచ్చరించారు. పేద సర్పంచులకు ఒక్కొక్కరికి ఐదు లక్షల నుండి 30 లక్షల వరకు బిల్లులు రావాలని ప్రభుత్వం గద్దెనెక్కి 15 నెలలు గడుస్తున్నా ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మాయమాటలతో ఓట్లు వేయించుకొని ఆరు గ్యారెంటీల హామీలతో ప్రజలను మోసం చేసి న రేవంత్ రెడ్డి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని అన్నారు. అరెస్టు అయిన వారిలో మాజీ సర్పంచులు పాకాల లక్ష్మారెడ్డి, నిరోషా కిరణ్, తిరుమల తిరుపతి తో పాటు వివిధ గ్రామాల సర్పంచులు ఉన్నారు.