calender_icon.png 31 January, 2025 | 4:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రంగనాయకులగుట్టను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలి

30-01-2025 02:05:18 AM

పురావస్తు పరిశోధకుడు డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి

హైదరాబాద్, జనవరి 29 (విజయక్రాంతి): మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రముఖ వర్తక కేంద్రమైన జడ్చర్ల రంగనాయక స్వామి గుట్టపై ఉన్న కాకతీయుల కాలపు శిల్పాలపై రంగులు తొలగించాలని పురావస్తు పరిశోధకుడు, ప్లీ ఇండియా ఫౌండేష న్, సీఈవో ఈమని శివనాగిరెడ్డి మంగళవారం సూచించారు.

చారిత్రక శిల్పాలు, శాసనాలు, స్థలాలు, కట్టడాలను గుర్తించి గ్రామస్తులకు వాటిపై అవగాహన కల్పించే ప్రిజర్వ్ హెరిటేజ్ ఫర్ పోస్టెరిటీ కార్యక్రమంలో భాగంగా ఆయన రంగనాయక గుట్టపై విస్తృతంగా అధ్యయనం చేశారు.

ప్రధాన ఆలయమైన రంగనాయకస్వామి రాతిశిల్పం, దాని వెనక 100 అడుగుల దూరంలోని మహిషాసుర మర్ధిని, భైరవ శిల్పాలు క్రీ.శ. 13వ శతాబ్ది నాటి కాకతీయ కాలానికి చెందినవని, గుట్టపై విశాలమైన కోట గోడ ఆనవాళ్లు ఉన్నాయన్నారు. ఎన్నో ఆకర్షణలున్న రంగనాయకస్వామి గుట్టను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని ఆలయ పాలకమండలి, జిల్లా యంత్రాంగానికి శివనాగిరెడ్డి విజ్ఞప్తి చేశారు.