calender_icon.png 29 March, 2025 | 10:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రంగంపేట తైబజార్ రెండు లక్షల రెండు వేలు..

26-03-2025 07:58:12 PM

కొల్చారం (విజయక్రాంతి): వాణిజ్య వ్యాపార కేంద్రమైన రంగంపేట కూరగాయల మార్కెట్ తై బజార్ రెండు లక్షల రెండు వేల రూపాయలకు కొమ్ముల సాయ గౌడ్ వేలం పాటలో దక్కించుకున్నట్లు పంచాయతీ కార్యదర్శి రాజు తెలిపారు. కొల్చారం మండలం రంగంపేట గ్రామంలో ప్రతి శుక్రవారం నిర్వహించే కూరగాయల మార్కెట్ తై బజార్ వేలంపాట బుధవారం నాడు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద పంచాయతీ  కార్యదర్శి రాజు ఆధ్వర్యంలో గ్రామ ప్రజల సమక్షంలో 2025-26 సంవత్సరానికి సంబంధించి తై బజార్ వేలం పాట నిర్వహించారు.

వేలం పాటలో పాల్గొనేవారు ముందుగా పదివేల రూపాయలను డిపాజిట్ చేసి వేలం పాటలో పాల్గొన్నారు. గ్రామానికి చెందిన మద్దెల చంద్రశేఖర్, అల్లి చందు, జోగయ్య, కొమ్ముల సాయ గౌడ్, నలుగురు వేలంపాటలో పాల్గొన్నారు. అందులో రెండు లక్షల 2 వేల రూపాయలకు వేలం పాట పాడి  కొమ్ముల సాయ గౌడ్ మార్కెట్ తై బజార్ దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏఈ శ్రీకాంత్, కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు గొండ కృష్ణ, బండి రమేష్, కొమ్ముల రవీందర్ గౌడ్, వెంకట్ గౌడ్, బాలరాజ్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.