calender_icon.png 17 November, 2024 | 9:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అన్ని రంగాల్లో రంగారెడ్డి ముందుండాలి

17-11-2024 01:29:30 AM

  1. అందుకోసం అధికారులు సమన్వయంతో పనిచేయాలి
  2. దిశ కమిటీ చైర్మన్, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి

రంగారెడ్డి, నవంబర్ 16 (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లాను అన్ని రంగాల్లో ప్రథమస్థానంలో నిలపాలని, అందుకోసం అధికా రులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో కృషి చేయాలని దిశ కమిటీ చైర్మన్, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు.

శనివారం జిల్లా కలెక్టరేట్‌లో ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అధ్యక్షతన వివిధ శాఖల జిల్లా అధికారులతో జిల్లా అభివృద్ధి, సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొండా విశ్వేశ్వ రెడ్డి ప్రజాప్రతినిధులు, అధికారులతో మాట్లాడి మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

మరుగుదొడ్లు లేని పాఠశాలలను గుర్తించి, వెంటనే ఆ సౌకర్యాన్ని కల్పించాలని ఆదేశించారు. జిల్లాలోని బస్తీ దవాఖానలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యమందించాలని జిల్లా వైద్యాధికారిని ఆదేశించారు. జిల్లాలో కిడ్నీ వ్యాధిగ్రస్తులకు డయాలసిస్ పరికరాలను అందుబా టులో ఉంచాలన్నారు.

కూరగాయల డిమాం డ్ ఉన్న నేపథ్యంలో వాటి సాగుకు రైతులను ప్రోత్సహించాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రా ల్లో పూర్తిస్థాయి సిబ్బందిని నియమించుకోవాలని, గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందించా లన్నా రు.

సమావేశంలో భాగంగా పంచాయతీరాజ్ ఆర్ అండ్‌బీ ఉపాధిహామీ, విద్యుత్, మిషన్ భగీరథ, జాతీయ రహదారులు, భూగర్భ జలాలు, సీపీఓ తదితర అంశాలపై సమీక్షించారు. సమావేశంలో షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, కలెక్టర్ సీ నారాయణరెడ్డి, అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీస్) ప్రతిమాసింగ్, ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ హేమంత్ పాల్గొన్నారు.