calender_icon.png 15 March, 2025 | 1:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అస్పత్రులలో ఆకస్మికంగా తనిఖీ

14-03-2025 12:00:00 AM

అధికారి డాక్టర్ మురళీధర్ 

మహబూబాబాద్.మార్చి13 (విజయ క్రాంతి): ఆసుపత్రిలోని  రికార్డులను నిర్వహణ సక్రమంగా చేపట్టాలని జిల్లా అధికారి డాక్టర్ మురళీధర్ సూచించారు.జిల్లా వైద్య  ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మురళీధర్  నేతృత్వంలోమహబూబాబాద్ పట్టణంలోని ప్రైవేట్ ఆసుపత్రులను, స్కానింగ్ సెంటర్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు.పట్టణంలోని ఆ యుష్ హాస్పిటల్‌ను పరిశీలించినప్పుడు ఆసుపత్రిలోని  రికార్డులను నిర్వహణ సక్రమముగా చేయాలని రికార్డ్ లను రెండు సం వత్సరాల వరకు భద్రపరచాల్సి ఉంటుందని తెలిపారు.

ఆరోగ్య హాస్పిటల్ స్కానింగ్ సెం టర్‌ను పరిశీలించినప్పుడు రికార్డుల నిర్వహణ సరిగా లేనందున షోకాజు నోటీసు జా రీ చేస్తున్నట్లు, అనంతరం శారద నర్సింగ్ హోంను తనిఖీ చేశారు. అంతే కాకుండా ప్రైవేట్ హాస్పిటల్లో నిర్వాహకులు వారు అం దించి సేవలకు సంబంధించిన ధరల పట్టికను వాడుక భాషలో అందరికీ కనిపించే విధంగా ప్రదర్శించాలని, ఆసుపత్రి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ను కూడా ప్రదర్శించాల్సి ఉం టుందని ఆయన అన్నారు.ఈ కార్యక్రమం లో ప్రోగ్రాం అధికారి డాక్టర్  సారంగం, మా స్ మీడియా అధికారి కొప్పు ప్రసాద్, ఆరో గ్య విద్యా బోధకులు కేవీ రాజు, ఎల్డి కంప్యూటర్ అరుణ్ తదితరులు పాల్గొన్నారు.