07-03-2025 12:00:00 AM
సిద్దిపేట అర్బన్ ఎంఈవోపై ఆరోపణలు
సిద్దిపేట, మార్చి 6 (విజయక్రాంతి): ఇంటర్మీడియట్ తుది పరీక్షలకు ఇన్విజిలేటర్స్ కేటాయింపులో సిద్దిపేట అర్బన్ మండల విద్యాశాఖ అధికారి చేతివాటం ప్రదర్శించారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విద్యాశాఖ నిబంధనల ప్రకారం పరీక్ష కేంద్రం సమీపంలోని వ్యాయామ, పార్ట్ టైం ఉపాధ్యాయులకు మాత్రమే ఇన్విజిలేటర్ విధులు కేటాయించాలి కానీ సిద్దిపేట పట్టణం, సిద్దిపేట అర్బన్, సిద్దిపేట రూరల్ మండలాలలో విధులు నిర్వహిస్తున్న వ్యాయా మ, పార్ట్ టైం ఉపాధ్యాయులకు ఎలాం టి సమాచారం ఇవ్వకుండా దుబ్బాక, బెజ్జంకి, మద్దూర్, మిరుదొడ్డి మండలాలలోని వివిధ గ్రామాలలో పనిచేస్తున్న వ్యాయామ ఉపాధ్యాయుల వద్ద చేతివాటం ప్రదర్శించి విధులు కేటాయించా రని పలువు ఉపాధ్యాయులు ఆరోపించారు.
నిబంధనలు ఉల్లంఘించి ఇన్విజి లేటర్స్ విధులు కేటాయించిన ఎంఈఓపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై సిద్దిపేట అర్బన్ ఎంఈఓ రాజ ప్రభాకర్ రెడ్డిని వివరణ కోరగా ఇన్విజిలేటర్స్ విధులకు అర్హుత గల ఉపాధ్యాయులకు సమాచారం ఇచ్చామన్నారు. స్థానికంగా వ్యా యామ, పార్ట్ టైం ఉపాధ్యా యులు సరిపోనందునే జిల్లా విద్య శాఖ అధికారి ఆదేశాల మేర కే ఇతర మండలాలకు అవకాశం కల్పించామని చెప్పారు. తనపై వస్తున్న ఆరో పణలు అవాస్తవమని వెల్లడించారు.