calender_icon.png 29 April, 2025 | 3:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మరో 12 రోజులు.. రాణా ఎన్‌ఐఏ కస్టడీ పొడిగింపు

28-04-2025 11:42:46 PM

న్యూఢిల్లీ: తహవూర్ రాణా ఎన్‌ఐఏ కస్టడీని మరో 12 రోజులు పొడిగిస్తూ సోమవారం ఢిల్లీ కోర్టు నిర్ణయం తీసుకుంది. గతంలో విధించిన కస్టడీ ముగియడంతో ఎన్‌ఐఏ అధికారులు రాణాను భారీ భద్రత నడుమ కోర్టులో హాజరుపరిచారు. ఎన్‌ఐఏ కస్టడీలో ఉన్న రాణాను ఇటీవల ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు విచారించారు. పాకిస్తాన్‌కు చెందిన కెనడా జాతీయుడైన రాణాను 26/11 ముంబై ఉగ్రదాడుల ప్రధానసూత్రధారిగా అనుమానిస్తున్నారు. అమెరికాలో తలదాచుకుంటున్న రాణాను ప్రత్యేక విమానంలో భారత్‌కు తీసుకొచ్చిన విషయం తెలిసిందే.