calender_icon.png 13 February, 2025 | 7:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రానా కాంప్లికేటెడ్

13-02-2025 12:09:17 AM

సిద్ధు జొన్నలగడ్డ రొమాంటిక్ కామెడీ మూవీ ‘కృష్ణ అండ్ హిజ్ లీల’. 2020లో  కరోనా మహమ్మారి సమయంలో ఓటీటీలో నేరుగా విడుదలైన ఈ సినిమా మంచి సక్సెస్ సాధించింది. రవికాంత్ పెరెపు దర్శకత్వంలో రానా దగ్గు బాటి, సంజయ్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం లవ్ స్టొరీపై ఒక రిఫ్రెషింగ్ టేక్. ఇందులో శ్రద్ధా శ్రీనాథ్, సీరత్ కపూర్, షాలిని వడ్నికట్టి కీలక పాత్రల్లో నటించారు. రానా ఈ పాపులర్ చిత్రాన్ని ప్రేమికుల రోజైన ఫిబ్రవరి 14న థియేటర్లలో విడుదల చేయనున్నారు.

ఈ సిని మా టైటిల్‌ను ‘ఇట్స్ కాంప్లికేటెడ్’గా మార్చారు. తాజాగా మేకర్స్ ఈ సినిమా విషయమై ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా రానా మాట్లాడుతూ.. “ ఈ సినిమా విడుదలకు ఫిబ్రవరి ౧౪ రైట్ టైమ్. ఇది రీరిలీజ్ కాదు. థియేటర్స్‌లో ఫస్ట్ టైం రిలీజ్. టైటిల్ విషయంలో ముందొకటి అనుకున్నాం.

-కానీ అది పెట్టనివ్వలేదు. తర్వాత ‘ఇట్స్ కాంప్లికేటెడ్’ డైరెక్టరే పెట్టారు” అన్నారు. సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుతూ.. “అవుట్ అఫ్ ది బాక్స్ కథలు ఉంటే రానా దగ్గరికి వస్తారు. రానా వాటిని అర్ధం చేసుకొని ముందుకు తీసుకెళతారు. ఇలాంటి కథలు చేయాలంటే కొందరు ధైర్యం చేయరు.

ఈ కథ రానాకి చెబితే చాలా స్ట్రాంగ్‌గా ఫీలయ్యారు” అన్నాడు. మీ ముగ్గురిలో ఎవరు కాంప్లికేటెడ్ అన్న విలేకరి ప్రశ్నకు రానా అని రవికాంత్ చెప్పారు. దీని కారణం రానా లైఫ్‌ను లీడ్ చేసే విధానమేనని చెప్పారు.