calender_icon.png 3 April, 2025 | 8:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంత్రి పొంగులేటి రంజాన్ శుభాకాంక్షలు

31-03-2025 12:00:00 AM

ఖమ్మం, మార్చి 30( విజయక్రాంతి ):-రంజాన్  పండుగను సోమవారం జరుపుకోనున్న సందర్భంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు రాష్ట్రంలోని ముస్లింలందరికీ తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. నెల రోజులు ఎంతో నిష్ఠతో ఉపవాసాలు ఉండి.. ఆకలిదప్పుల విలువ తెలుసుకొని.. పవిత్రంగా జరుపుకునే ఈద్ ఇదని పేర్కొన్నారు. సహనం, త్యాగం, జాలి, దయ, సేవాగుణాలను ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలనే దృఢ సంకల్పంతో..పిల్లలు, యువతకు దిశా నిర్దేశం చేసిన మాసం ఇదని తెలిపారు. మహమ్మద్ ప్రవక్త (స) ఆదేశానుసారం.. అనాది నుంచి నేటి వరకు ఫిత్రా పేరిట ఆహారం, వస్త్రాలు, నగదు రూపంలో పేదలకు సాయం చేస్తూ వస్తోన్న సంప్రదాయం ఎంతో గొప్పదని మంత్రి పొంగులేటి అభివర్ణించారు.  ఈద్గాలు, మసీదులలో ప్రత్యేక ప్రార్థనల నడుమ రంజాన్ పండుగను సంబురంగా జరుపుకోవాలని, ఈద్ ముబారక్ ఆత్మీయ శుభాకాంక్షలతో ఆనందం వెల్లివిరియాలని మంత్రి పొంగులేటి ఆకాంక్షించారు.