31-03-2025 07:19:18 PM
రంజాన్ మాసంతం కఠిన ఉపవాస దీక్షల అనంతరం జరుపుకునే పండగ ఈద్-ఉల్-ఫితర్...
పెద్ద కొడప్గల్ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్గల్ మండల కేంద్రంలో రంజాన్ పర్వదిన సందర్భంగా సోమవారం ఈద్గా వద్ద ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా మస్జిద్ లో భాగంగా సేవలందించిన సభ్యులకు పూలమాల షాలువలతో సత్కరించారు. రంజాన్ పర్వదిన సందర్భంగా కఠిన ఉపవాస దీక్షలు చేసినా అనంతరం జరుపుకునే పండుగను రంజాన్ అంటారు. ఈద్-ఉల్-ఫితర్ సందర్భంగా ముస్లిం సోదరులు అల్లా దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. ముస్లింలు రంజాన్ మాసాంతం కఠోరమైన ఉపవాస దీక్షలతో సంవత్సరమంతా ఏ దానాలు చేయకపోయినా రంజాన్ మాసంలో మాత్రం ముస్లిం సోదరులు తప్పకుండా దానధర్మాలు చేస్తారు.
అనారోగ్యంతో ఉన్నవారు కాకుండా వృద్ధులు పిల్లలు తప్ప అందరూ ఉపవాస దీక్ష చేపడుతారు. రంజాన్ పర్వదినం పురస్కరించుకొని తమ కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో సంతోషంగా జరుపుకోవడం అభినందనీయం మతసామరస్యానికి ప్రతీకగా ఐకమత్యం సోదర భావం విలసిల్లేలా రంజాన్ మాసం దైవభీతి దేవుడి పట్ల నమ్మకం మొదలైన మహత్తర సుగుణాలను రంజాన్ నెల మాసంతం ఉపవాస దీక్ష పాటించేవారు. అబద్ధం ఆడకుండా పరనిందకు పాల్పడకుండా నిగ్రహంతో ఉంటూ మాసాంతం దైవచింతనంలో గడుపుతూ ఉంటారు. ఈద్-ఉల్-ఫితర్ పురస్కరించుకొని నమాజ్లో ఇమామ్ మౌజన్ తో సహా కమిటీ అధ్యక్షులు మొహమ్మద్ రియాజుద్దీన్, షేక్ మహమ్మద్, సయ్యద్ అతిక్, ఫిరోజ్, షేక్ రషీద్, షేక్ ఖాసిం, జాఫర్ షా, ఆఫ్రౌజ్, మక్దూం, యాకూబ్, అహమ్మద్ షా, ఎండి గౌస్, ఎండి మహమ్మద్, కమిటీ సభ్యులు ముస్లిం సోదరులు తదితరులు ఉన్నారు.