31-03-2025 07:48:47 PM
పెద్ద కొడప్గల్ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా పెద్దకొడప్గల్ మండలం కాటేపల్లి గ్రామంలో సోమవారం ఘనంగా రంజాన్ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్లీం సోదరులు ఈద్గా వద్దకు వెళ్లి ప్రార్థనలు జరిపారు. అనంతరం బందువులను, స్నేహితులను కలిసి ఆలయ్ బలయ్ తీసుకున్నారు. సీనియర్ కాంగ్రెస్ నాయకులు మల్లప్పపటేల్ స్వగృహంనకు వెళ్లి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. హిందూ స్నేహితులను తమ ఇళ్ళకు తీసుకెళ్ళి పండుగ విందు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో వైస్ చైర్మన్ గోకన్ గంగాగౌడ్, మాజీ ఎంపిటిసి మొగులాగౌడ్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇస్మాయిల్ పటేల్, రసూల్ పటేల్, యూసూఫ్ పటేల్, హాజి పటేల్, రియాజ్ పటేల్, జాఫర్ పటేల్, ఇలియాస్ పటేల్, సల్మాన్ పటేల్, షఫీ పటేల్, షబ్బీర్ తదితరులు పాల్గొన్నారు.