తెలుగు చిత్ర పరిశ్రమలో తమకంటూ సింగర్స్‌గా మంచి గుర్తింపు సంపాదించుకున్న రమ్య బెహరా, అనురాగ్ కులకర్ణి పెళ్లి పీటలెక్కారు. హైదరాబాద్‌లో వీరిద్దరి వివాహం శనివారం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులతో పాటు సినీ పరిశ్రమకు చెందిన పలువురు గాయనీగాయకులు, సంగీత దర్శకులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనురాగ్ కులకర్ణి పాడిన పాటలన్నీ దాదాపు మంచి సక్సెస్ సాధించాయి.
కామారెడ్డికి చెందిన అనురాగ్ సూపర్ సింగర్ కార్యక్రమం ద్వారా తెలుగు వారికి పరిచయమయ్యారు. ‘శతమానం భవతి’ చిత్రంలో ‘మెల్లగా తెల్లారిందో’ సాంగ్‌తో ఫేమస్ అయ్యారు. ‘మిరా మిరా మీసం, ఆశాపాశం’ వంటి పాటలను ఆయనే పాడారు. రమ్యది నరసరావుపేట. ఆమె పలు సంగీత కార్యక్రమాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే బాహుబలి, టెంపర్, ఒక లైలా కోసం, ప్రేమకథా చిత్రం, లైక్యం, శతమానం భవతి’ వంటి చిత్రాల్లో పాటలు పాడారు. ముఖ్యంగా ‘బాహుబలి ది బిగినింగ్’లో ‘ధీవరా’ పాట ఆమెకు బాగా గుర్తింపు తెచ్చిపెట్టింది.