calender_icon.png 15 April, 2025 | 12:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంగరంగ వైభవంగా రాములోరి కళ్యాణం

06-04-2025 04:40:26 PM

రామకృష్ణాపూర్ (విజయక్రాంతి): రామకృష్ణాపూర్ శ్రీ కోదండ రామాలయం ఆలయంలో ఆదివారం శ్రీరామ నవమి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా వేద పండితులు శాస్త్రయుక్తంగా రాములవారితో సీతమ్మ తల్లికి కళ్యాణం జరిపించారు. ఈ కల్యాణోత్సవంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణం శ్రీరామనామ జపంతో మార్మోగింది. సత్యసాయి సేవ సమితి ఆధ్వర్యంలో భక్తులకు పానకం, వడపప్పు పంపిణీ చేశారు. ఈ కళ్యాణ మహోత్సవంలో చెన్నూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి, మందమర్రి ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ దేవేందర్ దంపతులు పాల్గొన్నారు. అనంతరం రాములోరి సీతమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కళ్యాణ తంతు అనంతరం భక్తులకు అన్నదాన వితరణ, తలంబ్రాలు పంపిణీ చేశారు.