మందమర్రి, (విజయక్రాంతి): ఐఎన్టియుసి అనుబంధం సింగరేణి కోల్ మైన్స్ లేబర్ యూనియన్ కేంద్ర కమిటీ చీఫ్ ఆర్గనైజింగ్ కార్యదర్శిగా ఏరియాలోని కేకే 5 గనిలో చైన్ మెన్ గా విధులు నిర్వహిస్తున్న రాంశేట్టి నరేందర్ ను నియమిస్తూ ఐఎన్ టియుసి జాతీయ అధ్యక్షులు జీ.సంజీవరెడ్డి, సెక్రటరీ జనరల్ బి జనక్ ప్రసాద్ లు శనివారం ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్బంగా రాంశెట్టి నరేందర్ మాట్లాడుతూ... తనపై నమ్మకంతో యూనియన్ కేంద్ర కమిటీలు బాధ్యతలు అప్పగించారని తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా అహర్నిశలు కార్మికుల సమస్యలపై పోరాడుతూ వారి న్యాయమైన హక్కుల సాధనకు కృషి చేస్తూ ఐఎన్టియుసి యూనియన్ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని స్పష్టం చేశారు. తనకు రెండవసారి అవకాశం ఇచ్చినందుకు సింగరేణి కోల్ మైన్స్ లేబర్ యూనియన్ అధ్యక్షులు సంజీవరెడ్డి, సెక్రెటరీ జనరల్ రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి చైర్మన్ బి జనక్ ప్రసాద్ లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.