calender_icon.png 6 March, 2025 | 9:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజల మన్ననలు పొందిన గొప్పనాయకుడు రాంరెడ్డి వెంకటరెడ్డి

05-03-2025 12:59:05 AM

వైరా, విజయ క్రాంతి( మార్చి 4) : మంత్రిగా  ప్రజల మన్ననలు పొందిన గొప్పనాయకుడు రాంరెడ్డి వెంకట్ రెడ్డి అని వైరా ఎమ్మెల్యే  మాలోత్ రాందాస్ నాయక్,జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు  పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ లు పేర్కొన్నారు.. మంగళవారం దివంగత మాజీ మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి 9వ వర్ధంతి సందర్భంగా   వైరా లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి వారు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు   మాట్లాడుతూ రాంరెడ్డి వెంకటరెడ్డి  ప్రజా జీవితంలో అత్యంత కీలకమైన పాత్ర పోషించి  అభివృద్ధి పథంలో ఖమ్మం జిల్లా ని సస్యశ్యామలం చేసిన గొప్ప నాయకత్వం కలిగిన వ్యక్తి అని కొనియాడారు.. 

రాంరెడ్డి వెంకటరెడ్డి  పాత లింగాల గ్రామ సర్పంచ్ స్థాయి నుంచి ఎల్ ఎం బి డైరెక్టర్ డిసిసి ఉపాధ్యక్షులుగా మాజీ ముఖ్యమంత్రి దివంగత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి  మన్ననలు పొందిన గొప్ప నాయకుడని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శీలం వెంకట నర్సిరెడ్డి, జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు పుచ్చకాయల వీరభద్రం, జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు మొక్క శేఖర్ గౌడ్, మాజీ మార్క్ ఫైడ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, కట్ల రంగారావు, సూరంపల్లి రామారావు, మున్సిపల్ చైర్మన్ సూతకాని జైపాల్, వైరా నియోజకవర్గ యువజన కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు పమ్మి అశోక్, పాలేటి నరసింహారావు, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి జెర్రిపోతుల అంజనీ, దార్నా రాజశేఖర్, ఆది ఆనందరావు, జవ్వాజి నాగరాజు, కోటేష్ నాయక్, తోటకూర గోపి, షేక్ జాన్ పాషా (గన్ను),ధరావత్ శంకర్ నాయక్, తెళ్ళురి వీరయ్య, ఐఏఎస్ నాగేశ్వరరావు, మెరుగు వెంకటి, వాంకుడోత్ బిక్య, రామ్ లాల్, నారపోగు నాగరాజు, తదితరులు పాల్గొన్నారు