నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలో ఉన్న వివిధ కోర్టుల్లో విచారణకు వస్తున్న దివ్యాంగులకు భవనంపైకి ఎక్కడానికి మెట్లు ఉండడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ర్యాంపులు ఏర్పాటు చేసేలా చూడాలని దివ్యాంగుల సంఘం నాయకులు ఇసాక్ అసియుద్దీన్ శుక్రవారం జడ్జి రాధికకు వినతి పత్రం అందజేశారు. దివ్యాంగులకు ర్యాంపులు ఏర్పాటు చేయడం వల్ల వారు పైకి రావడానికి సులభంగా ఉంటుందని వారు తెలిపారు.