calender_icon.png 11 March, 2025 | 12:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పరిగిలో 340 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

10-03-2025 08:56:23 PM

ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి...

ఇందిరమ్మ కమిటీ సభ్యులు అందరూ కలిసి గ్రామాల్లో తిరిగి సర్వే నిర్వహించాలి..

పరిగి నుండి నస్కల్ వెళ్లే నాలుగు లైన్ల రహదారి శంకుస్థాపన కార్యక్రమాలు..

పరిగి నుండి షాద్ నగర్ వెళ్లే రోడ్డుకు 120 కోట్లతో రోడ్డు పనుల శంకుస్థాపన...

గడిసింగాపూర్ నుండి రంగారెడ్డి పల్లి వరకు 100 కోట్లతో రోడ్డు పనులకు శంకుస్థాపన..

పరిగి (విజయక్రాంతి): రాష్ట్రంలోనే పరిగి నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజవర్గంగా సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో తీర్చిదిద్దుతానని రామ్మోహన్ రెడ్డి అన్నారు. సోమవారం టి.రామ్మోహన్ రెడ్డి  నివాసంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో తాను మాట్లాడుతూ... ఇందిరమ్మ కమిటీ సభ్యుల ద్వారానే ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ జరిగేటట్లు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. అదేవిధంగా పరిగి నుండి వికారాబాద్ రోడ్డుకు నాలుగు లైన్ల రహదారికి శంకుస్థాపన చేయడం జరుగుతుందని అన్నారు.

అదేవిధంగా పరిగి నుండి షాద్ నగర్ రోడ్డుకు నాలుగు లేన్ల రహదారికి శంకుస్థాపన చేసి గడిసింగాపూర్ నుండి రంగారెడ్డిపల్లి వరకు డబల్ రోడ్డు గురించి శంకుస్థాపన చేయడం జరుగుతుందని అన్నారు. పరిగి నియోజకవర్గం దశ దిశ మారే విధంగా కొత్త హంగులు ఏర్పడడానికి పరిగి కొత్త కుంట చెరువు పునరుద్ధరణ పనులు ప్రారంభ శంకుస్థాపన చేస్తామని అన్నారు. హెచ్ఎండిఏ పరిధిలోపలికి పూడూరు మండలం మన్నెగూడ వరకు పొడిగించడం జరిగింది, దాన్ని పరిధి నియోజకవర్గ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.

పరిగి-కృష్ణ రైల్వే లైన్ గురించి త్వరలో పనులు ప్రారంభం అవుతాయని, ఈ వచ్చే బడ్జెట్ సమావేశాలలో పరిగి లక్ష్మి దేవిపల్లి ప్రాజెక్టు గురించి నిధులు కేటాయించి పనులు ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. వేసవికాలంలో త్రాగునీటి సమస్య రాకుండా అధికారులతో ప్రణాళిక తయారు చేయిస్తున్నం అని నియోజకవర్గంలో త్రాగునీటి సమస్య రాకుండా చూసుకుంటాం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బి. పరశురాం రెడ్డి, వైస్ చైర్మన్ అయూబ్, శ్రీకాంత్ రెడ్డి, రామకృష్ణా రెడ్డి, విఠల్ నాయక్, రవి కాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.