calender_icon.png 18 November, 2024 | 7:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంతరాష్ట్ర చెక్ పోస్ట్ ను తనిఖీ చేసిన రామగుండం సీపీ

18-11-2024 04:38:47 PM

మంచిర్యాల (విజయక్రాంతి): మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా కోటపల్లి మండలం రాపన్ పల్లి అంతరాష్ట్ర సరిహద్దు చెక్ పోస్ట్ ను రామగుండం సిపి శ్రీనివాసులు మంచిర్యాల డిసిపి ఎక్కడి భాస్కర్ తో కలిసి తనిఖీ చేశారు. విధుల్లో ఉన్న పోలీసులు అప్రమత్తంగా ఉంటూ ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని సూచించారు. చెక్ పోస్ట్ లో ఇద్దరు ఎస్ఐ లు, పోలీస్ సిబ్బంది ఆయుధాలను కలిగి 24/7 పగడ్బందీగా అప్రమత్తంగా ఉంటూ వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ నిర్వహించి అక్రమంగా డబ్బు, మద్యం, బంగారం, ప్రజలను ప్రలోబాలకు గురి చేసే విలువైన వస్తువులు తరలిస్తుంటే పట్టుకుంటున్నారన్నారు.

ఇప్పటి వరకు రూ.4 లక్షల విలువ చేసే మద్యంను పట్టుకోవడం జరిగిందన్నారు. పక్క రాష్ట్రాల నుండి ధాన్యం రవాణా కాకుండా సివిల్ సప్లై వారు చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగిందని, మహారాష్ట్ర నుంచి ధాన్యం వాహనాలు వస్తే వాటిని తనిఖీ చేసి సివిల్ సప్లై అధికారుల ఆదేశాల మేరకు వాటిని తిరిగి పంపించడం జరిగిందన్నారు. అనంతరం వాహన తనిఖీల సమయంలో వివరాలు నమోదు చేసి రిజిస్టర్ ను పరిశీలించారు. వాహనాల తనిఖీల సమయంలో సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరిస్తు క్షుణ్ణంగా తనిఖీలు చేయాలని సిబ్బందికి సూచించారు. వీరి వెంట అడిషనల్ డీసీపీ (అడ్మిన్) సి రాజు, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, ఎస్ఐ సుబ్బారావు, వెంకట కృష్ణ, తదితరులు ఉన్నారు.