హైదరాబాద్: ప్రముఖ తెలుగు సినీ నటుడు అల్లు అర్జున్‌కు రాంగోపాల్‌పేట్ పోలీసులు(Ramgopalpet Police) మరోసారి నోటీసులిచ్చారు. సంధ్య థియేటర్ కేసులో పోలీసులు సోమవారం గీత ఆర్ట్స్ కార్యాలయానికి వెళ్లారు. కాగా, సంధ్య థియేటర్ తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ్ ను పరామర్శించుటకు అల్లు అర్జున్ ఆసుపత్రికి ఎప్పుడు వెళ్లిన తమకు సమాచారం ఇవ్వాలని పోలీసులు నోటీసులో పేర్కోన్నారు. అల్లు అర్జున్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పోందుతున్నా బాలుడు శ్రీతేజ్‌ను పరామర్శిస్తానని వెల్లడించారు. అల్లు అర్జున్(Allu Arjun) కిమ్స్ ఆస్పత్రికి వెళ్లొదంటూ ఆదివారం పోలీసుల నోటీసులు పంపారు. ఒకవేళ వస్తే అక్కడ జరిగే పరిణామాలకు బాధ్యత వహించాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు అల్లు అర్జున్ మేనేజర్‌కు పోలీసులు నోటీసులు అందజేశారు.