హైదరాబాద్: ప్రముఖ తెలుగు సినీ నటుడు అల్లు అర్జున్‌కు రాంగోపాల్‌పేట్ పోలీసులు(Ramgopalpet Police)నోటీసులిచ్చారు. అల్లు అర్జున్ కిమ్స్ ఆస్పత్రిలో బాలుడు శ్రీతేజ్‌ను పరామర్శిస్తానని వెల్లడించారు. అల్లు అర్జున్ కిమ్స్ ఆస్పత్రికి వెళ్లొదంటూ పోలీసుల నోటీసులు పంపారు. ఒకవేళ వస్తే అక్కడ జరిగే పరిణామాలకు బాధ్యత వహించాలంటూ నోటీసులుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు అల్లు అర్జున్ మేనేజర్‌కు పోలీసులు నోటీసులు అందజేశారు.
నటుడు అల్లు అర్జున్(Allu Arjun) శనివారం మధ్యాహ్నం నాంపల్లి కోర్టుకు హాజరై బెయిల్ ష్యూరిటీ పత్రాలను న్యాయమూర్తికి సమర్పించారు. ఆయన వెంట తన బావ చంద్రశేఖర్ రెడ్డి కూడా ఉన్నారు. కోర్టు విచారణ అనంతరం నేరుగా తన నివాసానికి చేరుకున్నారు. సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్‌ను నిందితుడు నంబర్ 11 (ఏ11)గా చేర్చారు. గత నెలలో, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య థియేటర్‌లో పుష్ప-2(Pushpa 2: The Rule) ప్రీమియర్ షో సందర్భంగా, తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడి సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనకు సంబంధించి చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్‌ని అరెస్ట్ చేశారు.