calender_icon.png 19 February, 2025 | 10:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాండురంగాపురంలో ఘనంగా సేవాలాల్ జయంతి వేడుకలు

15-02-2025 08:06:21 PM

పాల్వంచ,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండల పరిధి పాండురంగాపురంలో సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్  286వ జయంతి వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం సేవాలాల్ సేన నాయకులు అంగోత్ నగేష్,ఇస్లావత్ బాలు,గుగులోత్ భద్రు, బానోత్ భరత్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి అతిధిగా గ్రీన్ ఎర్త్ సొసైటీ వ్యవస్థాపకులు రమేష్ రాథోడ్(Green Earth Society Founder Ramesh Rathod),(ట్రైబల్ వెల్ఫేర్) టీఎస్టీడబ్ల్యూ ఉపాధ్యాయ సంఘ రాష్ట్ర కార్యదర్శి రాములు నాయక్(TSTW Teachers Association State Secretary Ramulu Nayak), హిరణ్ గాంధీ ఏటీవో(Hiran Gandhi ATO) పాల్గొన్నారు. ఈ సందర్బంలో సేవాలాల్ చిత్ర పటానికి పూలమాల వేసి, అనంతరం మహా బోగ్ కార్యక్రమం నిర్వహించారు.

ఈ పూజ కార్యక్రమం గోర్ శిక్వాడి రాష్ట్ర నాయకులు బానోత్ భోజ్య నాయక్ నిర్వహించారు. మహాత్మా గాంధీ కంటే ముందే అహింస, సత్యం పలకటం, గో సంరక్షణ, మత మార్పిడి చేయకుడదని, మందు. మాంసానీకి దూరంగా ఉండాలని చెప్పిన మహా నీయుడు సేవాలాల్ మహారాజ్ అనీ రమేష్ రాథోడ్ పేర్కొన్నారు.ఈ సందర్బంగా అంగోత్ నగేష్ అమ్మ మంగమ్మ గారి జ్ఞాపకార్థం వాలీబాల్ పోటీ నిర్వహించారు. ఈ కార్యక్రమం లో ఉపేందర్ ధర్మాసోత్, వెంకట్ బానోత్, మంగీలాల్ డిఈ కేటీపియస్, లక్ష్మోజీ, ఇస్లావత్ దేవి మాజీ సర్పంచ్ ,ఈశ్వర్ నాయక్, జబరులాల్, పంతులు, మాలోత్ హరిలాల్ వీరేందర్ శ్రీకాంత్ సాయి తదితరులు పాల్గొన్నారు