మంచిర్యాల, విజయక్రాంతి: మంచిర్యాల రైల్వే స్టేషన్ ప్రాంతంలో జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో శనివారం జరిగిన సమావేశంలో మంచిర్యాల పట్టణానికి చెందిన అక్కల రమేష్ ని రాష్ట్ర కార్యదర్శిగా నియమిస్తూ జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు గుమ్ముల శ్రీనివాస్ నియామక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా గుమ్ముల శ్రీనివాస్ మాట్లాడుతూ బీసీలంతా సంఘటితంగా ఉద్యమాలు చేసి డిమాండ్ల సాధనే లక్ష్యంగా పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు గగ్గూరి సత్తయ్య, రాజన్న తదితరులు పాల్గొన్నారు.