calender_icon.png 23 September, 2024 | 2:48 PM

రాందాస్ అథవాలే.. మళ్లీ మంత్రి గ్యారెంటీ: నితిన్ గడ్కరీ

23-09-2024 12:31:59 PM

నాగ్‌పూర్: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రసంగాల్లో చమత్కారాలు వినిపిస్తుంటాయి. తాజాగా తోటి  మంత్రిని ఉద్దేశించి సరదా వ్యాఖ్యలు చేశారు. ఆ మాటలు తాజాగా నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. మాప్రభుత్వం నాలుగోసారి అధికారంలోకి వస్తుందో, లేదో చెప్పలేము కానీ.. రాందాస్ అథవాలే మంత్రి అవుతారన్న గ్యారెంటీ మాత్రం ఖచ్చితంగా ఉంది అని గడ్కరీ వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో జరిగిన కార్యక్రమంలో ఈ విధంగా మాట్లాడారు. దాంతో అక్కడ ఉన్నవారు చిరునవ్వులు చిందించారు. అప్పుడు ఆ వేదికపై అథవాలే కూడా ఉన్నారు. ఆయనను టీజ్ చేస్తూ జస్ట్ జోక్ చేస్తున్నా అన్నారు. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా నేత అథవాలే.. వరుసగా మూడుసార్లు మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మరోసారి బాజాపా గెలిస్తే తన పరంపరను కొనపాగిస్తాననే విశ్వాసం వ్యక్తం చేశారు. 288 అసెంబ్లీ స్థానాలున్న మహారాష్ఠ్రకు త్వరలో ఎన్నికలు జరుగనుండగా  రాందాస్ అథవాలే  పార్టీ కూడా ఎన్నికలలో పాల్గొంటోంది.