calender_icon.png 23 October, 2024 | 3:59 PM

ఆర్టీఏ కార్యాలయంలో రాంచరణ్ సందడి

23-10-2024 12:04:41 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 22 (విజయక్రాంతి): ప్రముఖ సినీ నటుడు కొణిదెల రాంచరణ్ ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో మంగళవారం సందడి చేశారు. తాను విదేశాలలో కొనుగోలు చేసి దిగుమతి చేసుకున్న రోల్స్ రాయిస్ కారుకు ఖైరతాబాద్ ఆర్టీఏ (సెంట్రల్ జోన్) కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. రాంచరణ్ కారుకు టీజీ09సీ 2727 నంబర్‌ను కేటాయించినట్టు జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ సీ రమేశ్ తెలిపారు.