calender_icon.png 27 October, 2024 | 3:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డ్యాన్సర్ల సంఘానికి రామ్‌చరణ్ చేయూత

04-07-2024 12:05:00 AM

నృత్య దర్శకుడు, డ్యాన్సర్ల సంఘ అధ్యక్షుడు  జానీ మాస్టర్ తమ సంఘ సభ్యులకు ఆరోగ్య బీమా అందించే విషయమై తన అభిమాన కథానాయకుడైన రామ్ చరణ్‌ను గతంలో సంప్రదించారు. దీనిని గుర్తుపెట్టుకున్న చరణ్, ఇటీవల ఆయన పుట్టినరోజు నాడు తన ఇంటికి పిలిపించి జానీ కోరిన సహాయాన్ని అందించారు. దీని ద్వారా డ్యాన్సర్ల సంఘం (టి.ఎఫ్.టి.టి. డి.ఎ) లోని 500 కుటుంబాలు లబ్ది పొందనున్నాయి. ఈ సందర్భంగా తన భావోద్వేగాలను సామాజిక మాధ్యమాలలో పంచుకున్న జానీ మాస్టర్, దీనికి సహకరించిన రామ్ చరణ్ దంపతులకు ధన్యవాదాలు తెలియజేశారు.