మందమర్రి (విజయక్రాంతి): నేతకాని మహర్ సంక్షేమ సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షునిగా పట్టణానికి చెందిన సునార్కర్ రాంబాబును ఎన్నుకున్నారు. మంచిర్యాలలోని ఆర్యవైశ్య భవనంలో శనివారం నిర్వహించిన నేతకాని ఆత్మగౌరవ సభలో మంచిర్యాల జిల్లా నేతకాని మహర్ సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, రాష్ట్ర అధ్యక్షులు దుర్గం రాజేష్ లు జిల్లా కమిటీని నియమించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి గొల్లపల్లి వెంకటేష్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా జాడి గంగాధర్, జిల్లా ఉపాధ్యక్షులుగా జాడి తిరుపతి, జిల్లా అధికార ప్రతినిధిగా కొండగుర్ల శ్రీనివాస్, జిల్లా కార్యదర్శిగా లక్ష్మీరాజ్యం, కార్యవర్గ సభ్యులుగా కలాలి భీమయ్య, సదువుల రమణ దుర్గం శ్రీనివాస్ లుగా నియమించారు. ఈ సందర్బంగా నేతకాని మహార్ సంక్షేమ సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రాంబాబు మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతను నెరవేరుస్తానని అన్నారు. నేతకానిల హక్కుల కోసం అభివృద్ధికై కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు.