- భిన్నత్వంలో ఏకత్వం లోక్‌మంథన్
- పద్మశ్రీ విద్యా వింధు సింగ్
- మూడో రోజు సంబురంగా సాగిన కార్యక్రమం
హైదరాబాద్, నవంబర్ 23 (విజయక్రాంతి): రాముని జీవితం మనకు ఆదర్శమని పద్మశ్రీ విద్యా వింధు సింగ్ పేర్కొన్నారు. లోకమంథన్ భాగ్యనగర్2024 విజయవంతంగా సాగుతోంది. శిల్పకళావేదికలో పలు అంశాలపై జరిగిన సెమినార్‌లో దేశ, విదేశాలకు చెందిన వారు పాల్గొన్నారు.
లోక్ సాహిత్యంపై ఏర్పాటు చేసిన సదస్సులో విద్యా వింధు సింగ్ మాట్లాడుతూ ప్రాచీన కాలం నుంచి వచ్చిన అనేక పాటలు, కథలు ఇప్పుడు అంతరించిపోయాయన్నారు. కానీ దేశంలో మన సంస్కృతి, సంప్రదాయాలు నేటికీ సజీవంగానే ఉన్నాయని పేర్కొన్నారు.
సామాజిక విలువలను దిగజార్చుతున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, అర్థం పర్థం లేని సినిమా పాటలు సమాజాన్ని నాశనం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పాశ్చాత్య పోకడలు భారతీయ విలువలను ఎత్తిచూపలేవని ఆమె పేర్కొన్నారు. భిన్నత్వంలో ఏకత్వం లోక్‌మంథన్ అని అభిప్రాయపడ్డారు.
పురాతన సంస్కృతిని కాపాడుతున్నాం..
యూరప్‌లోని లిథువేనియా నుంచి వచ్చిన అతిథులు ప్రదర్శించిన అగ్ని ఆచారాలు పురాతన సంస్కృతిని వారు కాపా డుతున్న తీరును చాటిచెప్పాయి. ఒకప్పు డు హిందూ మతాన్ని పోలి ఉండే రోమా సంప్రదాయాన్ని అనుసరించే లిథువేనియాలో కాలక్రమంలో చోటుచేసుకున్న దండయాత్రల వల్ల క్రైస్తవం ప్రభావం పెరిగి 95 శాతం ప్రజలు మతం మారినా.. ఇంకా సుమారు 5శాతం మంది క్రీ.పూ. నుంచి ఉన్న తమ మూలాలను మర్చిపోలేదని ఆ దేశానికి చెందిన కళాకారిణి ఇయావా తెలిపారు.
క్రీ.పూ నుంచి ఉన్న అనేక ఆచారాలు, సంప్రదాయాలు, మత విశ్వాసాలను తాము ఇప్పటికీ పాటిస్తున్నామని ఆమె వివరించారు. సవాళ్ల మధ్య ఈ సంప్రదా యాలను సజీవంగా ఉంచుతూ అంతర్జాతీయ వేదికలపై తమ సాంస్కృతిక, ఆధ్యాత్మిక గుర్తింపును కాపాడుకోవడానికి నిరంతర పోరాటం చేస్తున్నామన్నారు. లోకమంథన్ తమ ఉనికిని చాటేందుకు ఓ వేదికగా తోడ్పడిందని తెలిపారు.
డా. ప్రసాద్ వామన్ దియోధర్, షిప్రా పాఠక్, డా. ఎండీ శ్రీనివాసన్, సందీప్ సింగ్ వంటి ప్రముఖులు సైతం ప్రసంగించారు. లోక్‌మంథన్‌లో భాగంగా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగాయి. శనివా రం నాటి కార్యక్రమాలకు ఆర్‌ఎస్‌ఎస్ అధినేత మోహన్ భాగవత్ హాజరయ్యారు.
లోక్‌మంథన్ నేడు చివరి రోజు
ఆర్మేనియా, టర్కీ, ఇరాక్, సిరి యా తదితర ప్రాంతాల్లో ఇంకా మ నుగడలో ఉన్న ప్రాచీన యెజిదీ అనే మతాన్ని ఆచరించే ప్రజల సూర్యారాధన కార్యక్రమంతో ఆదివారం చివరిరోజు కార్యక్రమం ప్రారంభమవుతుంది. అనంతరం శిల్పకళా వేదికలో లోక్ సురక్ష, న్యా య్, వికాస్‌కి లోక్ ఆదరణ, మహా న్ భారతోత్తం అనే అంశాలపై సె మినార్ జరుగుతుంది.
ముగింపు ఉత్సవాలకు ముఖ్య అతిథిగా ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ హాజరవుతారు. కేంద్రమంత్రులు గజేంద్రసింగ్ షెకావత్, నిర్మలా సీతారామన్ హాజరుకానున్నారు. చివరిరోజు జరిగే సంగీత, జానపద కార్యక్రమాలకు ప్రజలు హాజరు కావాలని నిర్వాహకులు కోరారు.