calender_icon.png 7 February, 2025 | 7:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వేడుకగా రామలింగేశ్వరుడి రథోత్సవం

07-02-2025 12:00:00 AM

నల్లగొండ, ఫిబ్రవరి 6 (విజయక్రాంతి) : చెరువుగట్టు రామలింగేశ్వరస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గురువారం స్వామివారి రథోత్సవాన్ని నిర్వహించారు. ప్రత్యేక పూజల అనంతరం పార్వతీ సమేత జడల రామలింగేశ్వరస్వామి ఉత్సవ విగ్రహాలను పూలతో అందంగా అలంకరించిన రథంపై ఆశీలను చేసి మేళతాళాలు, డప్పుచప్పుల నడుమ ఊరేగించారు.

తెల్లవారుజామున ఆది దంపతులను పర్వత వాహనంపై ఆలయ వీధుల్లో ఊరేగించి వీరముష్టి వంశీయులుతో తొలిపూజ నిర్వహించి అగ్నిగుండాలు ప్రారంభించారు. అగ్నిగుండాలపై నడిస్తే పంటలు బాగా పండి సుభిక్షంగా ఉంటామని భక్తుల నమ్మకం. శివసత్తులు అగ్నిగుండాలకు రావడం ఆనవాయితీగా కొనసాగుతున్నది.