calender_icon.png 1 April, 2025 | 11:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా రామకృష్ణ

28-03-2025 01:34:20 AM

ఇంతకుముందే అధ్యక్షుడిగా హరిప్రసాద్ ఏకగ్రీవ ఎన్నిక

జనగామ, మార్చి 27(విజయక్రాంతి): జనగామ బార్ అసోసియేషన్ జనగామ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పాలకుర్తి రామకృష్ణ ఎన్నికయ్యారు. బార్ అసోసియేషన్ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 17న నోటిఫికేషన్ ఇవ్వగా వివిధ పదవులకు పలువురు నామినేషన్లు వేశారు. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం ఈ నెల 23న అధ్యక్షుడిగా దండెబోయిన హరిప్రసాద్‌యాదవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ప్రధాన కార్యదర్శి, కార్యవర్గ సభ్యుల ఎన్నిక కోసం తాజాగా గురువారం పోలింగ్ నిర్వహించారు. ప్రధాన కార్యదర్శి పదవి కోసం పాలకుర్తి రామకృష్ణ, మన్నె సత్తయ్య పోటీ పడ్డారు. లెక్కింపు అనంతరం రామకృష్ణ 28 ఓట్ల మెజారిటీతో గెలిచిచారు. కార్యవర్గ సభ్యులుగా బి.చరణ్, ఎన్. శ్రీమన్ , ఈ.జ్యోత్స్న, రవికుమార్, కె.దాసు ఎన్నికైనట్లు ఎన్నికల ప్రధాన అధికారి శ్రీరామ్ శ్రీనివాస్, సహాయ ఎన్నికల అధికారులు దొమ్మాటి సురేష్, గుండెల్ని రాజశేఖర్ తెలిపారు.

మరోవైపు ఉపాధ్యక్షుడిగా ఇరిగి అశోక్, జాయింట్ సెక్రెటరీగా చాట్ల నర్సింగరావు, కోశాధికారిగా ఏ,బాలరాజు, లైబ్రరీ సెక్రెటరీగా సయ్యద్ అన్వర్ ఉల్లా అస్మి, స్పోరట్స్ అండ్  కల్చరల్ సెక్రెటరీగా రెడ్డబోయిన రాజు, మహిళా కార్యదర్శిగా కె.సునీత రాణి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.