calender_icon.png 23 January, 2025 | 10:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెద్దపల్లి జిల్లాలో ఏసీబీ వలలో అవినీతి తిమింగలం

23-01-2025 05:11:00 PM

రిటైర్డ్ ఉపాధ్యాయుల నుంచి పదివేల లంచం తీసుకుంటూ పట్టుబడ్డ రామగుండం ఎస్టిఓ మహేశ్వర్... 

పెద్దపల్లి (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లాలో గురువారం ఎసీబీ వలలో అవినీతి తిమింగలం చిక్కింది. రిటైర్డ్ ఉపాద్యాయుడు కన్నూరి ఆనందరావు నుండి రూపాయలు రూ.10,000 వేల లంచం తీసుకుంటూ రామగుండం ఎస్టిఓ ఏకుల మహేశ్వర్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఆఫీస్ సబార్డినేట్ రెడ్డవేణీ పవన్ పెన్షన్ మంజూరు కోసం రిటైర్డ్ ఉపాధ్యాయడైన కన్నూరి ఆనంద రావుకు పెన్షన్ ఎస్టిఓ కార్యాలయం చుట్టూ తిరుగుతుండగా పెన్షన్ మంజూరి కోసం ఎస్టీవో లంచం డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో ఏసీబీ అధికారులు వలపన్ని ఎస్టిఓ క్రికెట్ ఉపాధ్యాయుని వద్ద పదివేల లంచం తీసుకుంటుండగా మాటు వేసి పట్టుకున్నారు. జిల్లాలో ఏసిపి అధికారుల దాడితో సంచలన సృష్టించింది.