calender_icon.png 22 April, 2025 | 10:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలతో రైతులకు గౌరవం పెరిగింది

22-04-2025 06:11:50 PM

కొనుగోలు కేంద్రాల ప్రారంభోత్సవంలో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్...

రామగుండం (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలతో రైతుకు గౌరవం పెరిగిందని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్(MLA Makkan Singh Raj Thakur) అన్నారు. పెద్దంపేట గ్రామంలోని పోచమ్మ గుడి వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రజా ప్రతినిధులు, అధికారులు రైతులతో కలిసి మంగళవారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... ఎలాంటి కటింగ్ లు లేకుండా రైతుల ధాన్యాన్ని కొనుగోలు ప్రభుత్వం చేస్తుందని,  ప్రస్తుతం నాలుగో సారి కటింగ్ లు లేకుండా కొనుగోలు జరుగుతున్నట్టు చెప్పారు.

కొనుగోలు కేంద్రాలలో ఎలాంటి అవినీతి లేకుండా ఎప్పటికప్పుడు తాను డేగ కళ్ళతో పర్యవేక్షణ చేస్తానని, గతంలో బీఆర్ఎస్ పాలనలో కటింగ్ ల పేరిట రైతులను నిలువునా ముంచారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరుగాలం కష్టపడి, చెమటోడ్చి పండించిన రైతుల కష్టార్జితాన్ని గత ప్రభుత్వంలోని పెద్దలు కటింగ్ ల పేరిట ఏ విధంగా అవినీతికి పాల్పడినారో ప్రజలందరికీ తెలుసన్నారు. ఇప్పుడు 48 గంటల్లోనే రైతు ఖాతాలో డబ్బులు జమ అవుతున్నాయని,  రుణమాఫీ, సన్న వడ్లకు బోనస్ తో రైతుల కుటుంబాలు ఎంతో ఆనందం ఉందన్నారు. 

ఈసారి కూడా సన్న వడ్లకు బోనస్ అందిస్తామని, గత సీజన్లో సన్న వడ్ల బోనస్ రాష్ట్ర మొత్తం మీద ప్రభుత్వం రైతులకు 1234 కోట్ల రూపాయలు అందించగా, అందులో ఒక్క రామగుండం నియోజకవర్గంలోనే అత్యధికంగా  బోనస్ ను రైతులు పొందారని, నియోజకవర్గంలో పెద్దపెట్ రైతులు ఎక్కువగా ప్రయోజనం పొందారని చెప్పారు. త్వరలోనే అన్ని గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ళను మంజూరు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు, అంతర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తాజా మాజీ కార్పొరేటర్లు తదితరులు ఉన్నారు.