23-04-2025 01:07:05 AM
రామగుండం ఏప్రిల్ 22 (విజయక్రాంతి): పెద్దంపేట గ్రామంలోని పోచమ్మ గుడి వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రజా ప్రతినిధులు, అధికారులు రైతులతో కలిసి మంగళవారం రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎలాంటి కటింగ్ లు లేకుండా రైతుల ధాన్యాన్ని కొనుగోలు ప్రభుత్వం చేస్తుందని, ప్రస్తుతం నాలుగో సారి కటింగ్ లు లేకుండా కొనుగోలు జరుగుతున్నట్టు చెప్పారు. ఇప్పుడు 48 గంటల్లోనే రైతు ఖాతాలో డబ్బులు జమ అవుతున్నాయని, రుణమాఫీ, సన్న వడ్లకు బోనస్ తో రైతుల కుటుంబాలు ఎంతో ఆనందం ఉందన్నారు. వ్యవసాయ అధికారులు, అంతర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు .కాంగ్రేస్ పార్టీ నాయకులు తాజా మాజీ కార్పొరేటర్లు ఉన్నారు.