వెంకటేశ్వర స్వామి, పంచముఖ హనుమాన్ స్వామి లను దర్శించుకొన్న సీపీ
మందమర్రి,(విజయక్రాంతి): ముక్కోటి ఏకాదశి(Mukkoti Ekadashi) పర్వదినాన్ని పురస్కరించుకొని రామగుండం సీపీ శ్రీనివాస్(Ramagundam CP Srinivas) పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం(Sri Venkateswara Swamy Temple), పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం(Panchamukha Anjaneya Swamy Temple)లో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి చేరుకొన్న రామగుండం సీపీ శ్రీనివాస్, మంచిర్యాల డీసీపీ భాస్కర్ రావు, బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ లకు ఆలయ పూజారులు, ఆచార్యులు మంత్రోచ్ఛారణ నడుమ ఘన స్వాగతం పలికారు. స్వామి వారిని దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సీపీ, డీసీపీలను స్వామి వారి శేష వస్త్రాలతో ఆలయ పూజారులు, కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు.
ఈ సందర్బంగా రామగుండం సీపీ మాట్లాడుతూ... భక్తులు ఎలాంటి ఇబ్బంది లేకుండా పటిష్ట భద్రత చర్యలు చేపట్టామని, దైవ దర్శనం కొరకు అన్ని ఆలయాలో తగిన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. భక్తులు ప్రశాంతంగా క్యూ లైన్లు పాటిస్తూ దైవ దర్శనం చేసుకోవాలని కోరారు. ప్రజలందరు ప్రశాంతంగా సుఖసంతోషాలతో ఉండాలని, అందరికి మంచి జరగాలని, అందరిపై ఆ భగవంతుడి ఆశీస్సులు ఉండాలని వెదుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ శశిధర్ రెడ్డి, ఎస్ఐ రాజశేఖర్ లు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.