calender_icon.png 5 January, 2025 | 2:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శేష జీవితాన్ని కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడపాలి

31-12-2024 03:17:45 PM

రామగుండం,(విజయక్రాంతి): శేష జీవితాన్ని కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడపాలని పోలీస్ శాఖలో సుదీర్ఘ కాలం పాటు విధులు నిర్వర్తించి ఉద్యోగ విరమణ పొందిన వారికి రామగుండం పోలీస్ కమీషనర్ కార్యాలయం(Ramagundam Police Commissioner Office)లో పదవీ విరమణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి రామగుండం సీపీ శ్రీనివాస్(Ramagundam CP Srinivas) పాల్గొని పదవీ విరమణ  పొందిన ఐదుగురు పోలీస్ అధికారులను కుటుంబ సభ్యులతో కలిసి శాలువా, పూలమాలతో సత్కరించి జ్ఞాపిక అందచేసి శుభాకాంక్షలు తెలియజేశారు.

పదవీ విరమణ పొందిన  టి.లక్ష్మణ్ ARSI 1989 సంవత్సరంలో పోలీస్ డిపార్ట్మెంట్ లోకి కానిస్టేబుల్ గా ఎంపికై అంచలంచలుగా ఎదిగి 35 సంవత్సరముల,8 నెలలు విధులను నిర్వహించారు. 15 కాష్ రివార్డ్స్, 01-GSE పొందారు. ఎస్.కే అక్బర్ పాషా ఎస్ఐ శ్రీరాంపూర్ 1989 సంవత్సరంలో పోలీస్ డిపార్ట్మెంట్ లోకి కానిస్టేబుల్ గా ఎంపికై  అంచలంచలుగా ఎదిగి 35 సంవత్సరముల, 09 నెలల,15 రోజులు విధులను నిర్వర్తించారు. 04-కాష్ రివార్డ్లు ,01-GSE పొందారు. ఎ.రాములు ఎస్ ఐ మంథని  1982 సంవత్సరంలో పోలీసు డిపార్ట్మెంట్ లోకి కానిస్టేబుల్ గా ఎంపికై  అంచలంచలుగా ఎదిగి 42 సంవత్సరముల, 01 నెల,03 రోజులు విధులను నిర్వర్తించారు. 05-కాష్ రివార్డ్లు , 03-GSE పొందారు.

షఫీ ఉల్లా ఖాన్ ఏఎస్ ఐ-1471 శ్రీరాంపూర్ పిఎస్  1989 సంవత్సరంలో పోలీసు డిపార్ట్మెంట్ లోకి కానిస్టేబుల్ గా ఎంపికై  అంచలంచలుగా ఎదిగి 35 సంవత్సరముల, 06 నెలల,25 రోజులు విధులను నిర్వర్తించారు. 043-కాష్ రివార్డ్లు ,07-GSE 02 ప్రశంసా పత్రాలు  పొందారు. వి రవీందర్ ఏఎస్ ఐ పెద్దపల్లి అటాచ్ పీసీఆర్ రామగుండం  1989 సంవత్సరంలో పోలీసు డిపార్ట్మెంట్ లోకి కానిస్టేబుల్ గా ఎంపికై  అంచలంచలుగా ఎదిగి 35 సంవత్సరముల, 05 నెలల,14 రోజులు విధులను నిర్వర్తించారు. 01- ప్రశంసా పత్రం  ,01-GSE పొందారు.

ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ గతంలో పోలీసు వ్యవస్థ అత్యంత క్లిష్ట పరిస్థితుల నందు విధులను నిర్వర్తించి ప్రస్తుతం పోలీసు వ్యవస్థ ప్రశాంతంగా ఉండడానికి గల కారణమైన అధికారులకు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు.  ఉద్యోగ విరమణ చేసిన మీరు ఇకపై కుటుంబ సభ్యులతో  తమ శేష జీవితాన్ని ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఆనందంగా గడపాలని  సూచించారు. ఎటువంటి అవసరం ఉన్న కమీషనరేట్ పోలీసు వ్యవస్థ ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు డిసిపి అడ్మిన్ సి. రాజు,  ఎఆర్ ఏసీపీ ప్రతాప్ సుందర్ రావు, ఏ ఓ శ్రీనివాస్, రిజర్వ్ ఇన్స్పెక్టర్ లు దామోదర్, వామన మూర్తి, శ్రీనివాస్, మల్లేశం, సంపత్, సూపరిండెంట్స్ ఇంద్రసేనారెడ్డి, మనోజ్ కుమార్, సంధ్య, రామగుండం పోలీస్ కమీషనరేట్ పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షులు బోర్లా కుంట పోచలింగం, స్వామి, పదవి విరమణ అధికారుల కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.