రామగుండం, జనవరి 29 : పెద్దపల్లి జిల్లా రామగుండం ప్రాంతంలోని ఎన్టిపి సి ఐదవ డివిజన్ రామయ్యపల్లికి అఘోరి మాత వచ్చింది. దీంతో ఆ అఘోరిని చూసేందుకు ప్రజలు ఉత్సా హం చూపుతున్నారు. రెండు రోజుల క్రితం సిద్దిపేట జిల్లా కొమురవెల్లి దేవ స్థానం వద్ద అ అఘోరి కత్తితో భక్తులపై దాడి చేసిందనే ఘటన సోషల్ మీడియాలో వ్యాపించడంతో పోలీసులు ముందస్తుగా బందోబస్తు నిర్వహిస్తున్నారు. అ అఘోరి మళ్ళీ ఎక్కడ ప్రత్యక్షమ వుతుందో అని ప్రజలు చర్చించు కుంటున్నారు.