మంత్రి శ్రీధర్‌బాబుకు పరిశోధన పత్రం అందజేత
మంథని, నవంబర్ 5 (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని రామగిరి ఖిల్లా ఔషధ మొక్కలపై శాతవాహన విశ్వవిద్యాలయ అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.నరసింహమూర్తి పరిశోధన చేశారు. మంగళవారం ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబును హైదరాబాద్‌లో కలిసి ప్రాథమిక పరిశోధన పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ.. రామగిరి కొండలపై విస్తరించి ఉన్న ఔషధ మొక్కలు, వృక్ష వైవిద్యం గురించి చేసిన పరిశోధనా పత్రాన్ని అంతర్జాతీయ పరిశోధన పత్రికలో ప్రచురించినట్టు మంత్రికి తెలియజేశామన్నారు.
దాదాపు 300 పైచిలుకు ఔషధ మొక్కల గురించి సమగ్ర సమాచారాన్ని పుస్తక రూపంలో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నామన్నారు. శ్రీధర్‌బాబును ఆయన స్నేహితులు కలిసి మరిన్ని పరిశోధనల కోసం ప్రొత్సహం ఇవ్వాలని కోరారు. స్పందించిన మంత్రి సానుకూలంగా స్పందించారు.