calender_icon.png 7 January, 2025 | 1:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాముడు నడిచిన నేల రామగిరి ఖిల్లా

05-01-2025 08:02:08 PM

ఖిల్లాను అంతర్జాతీయ స్థాయిలో పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి చేస్తాం

రామగిరిలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు...

మంథని (విజయక్రాంతి): రాముడు నడిచిన నేలగా పేరుగాంచిన రామగిరి కిల్లాను అంతర్జాతీయ స్థాయిలో పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ఆదివారం రామగిరి  మండలంలో పర్యటించిన మంత్రి  మాట్లాడుతూ.. ప్రముఖ పుణ్యక్షేత్రమైన రామగిరి ఖిల్లాను అభివృద్ధి చేయడం కొరకు రాష్ట్ర ముఖ్యమంత్రి మన జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంగా ఐదు కోట్ల రూపాయలను మంజూరు చేశారని, బేగంపేట, రత్నాపూర్ గ్రామాల నుండి రామగిరి ఖిల్లాకు ఇరువైపులా రోడ్లు వేసి అభివృద్ధి చేయడం కొరకు, రామగిరి ఖిల్లాపై మౌలిక వసతులు కల్పిస్తామని, రామగిరి ఖిల్లాపై ఎన్నో ఔషధ మొక్కలు ఉన్నాయని, శ్రీరాముడు నడిచిన నేలగా ప్రసిద్ధి చెందిందని, ఇలాంటి పుణ్యక్షేత్రాన్ని అన్ని హంగులతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఈ క్షేత్రాన్ని అభివృద్ధి చేయడం కొరకు ప్రణాళికలు సిద్ధం చేసి నిధులు మంజూరు కొరకు కృషి చేస్తానని మంత్రి అన్నారు.