- త్వరలోనే పనులు ప్రారంభం
- కాంగ్రెస్ నేత దుద్దిళ్ల శ్రీనుబాబు
మంథని, నవంబర్ 3 (విజయక్రాంతి): ఇతిహాస చరిత్ర కలిగిన రామగిరి ఖిల్లా గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో అభివృద్ధికి నోచుకోదని, కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి శ్రీధర్ బాబు ప్రత్యేక చొరవతో సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి రామగిరిని పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దడం కోసం రూ.5 కోట్లు మంజూరు చేయించారని కాంగ్రెస్ నేత దుద్దిళ్ల శ్రీనుబాబు తెలిపారు.
త్వరలోనే అభివృద్ధి పనులు ప్రారంభం కానున్నాయని వెల్లడించారు. ఆదివారం ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి రామగిరి ఖిల్లాను సందర్శించారు. ముందుగా బేగంపేటలోని పెద్దమ్మ ఆలయంలో పూజలు చేశారు.
రామగిరి ఖిల్లా పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడం వల్ల యువతకు ఉపాధి లభిస్తుందన్నారు. ఆయనవెంట బ్లాక్ కాంగ్రె స్ అధ్యక్షుడు తొట్ల తిరుపతి, కిసాన్ సెల్ జిల్లా చైర్మ న్ ముస్కుల సురేందర్‌రెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు వైనాల రాజు, రొడ్డ బాపు, బాలాజీ, నాయకులు తోట చంద్రయ్య, ఆరెల్లి కొమురయ్య, బర్ల శ్రీనివాస్, ముస్తాల శ్రీనివాస్, కాటం సత్యం ఉన్నారు.