- ఖిల్లాను పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి చేస్తాం
- రామగిరిలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
మంథని, జనవరి 5 (విజయ క్రాంతి): రాముడు నడిచిన నేలగా పేరుగాంచిన రామగిరి కిల్లాను అంతర్జాతీయ స్థాయిలో పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని రాష్ర్ట ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు.
ఆదివారం రామగిరి మం డలంలో పర్యటించిన మంత్రి మాట్లాడు తూ ప్రముఖ పుణ్యక్షేత్రమైన రామగిరి ఖిల్లా ను అభివృద్ధి చేయడం కొరకు రాష్ర్ట ముఖ్యమంత్రి మన జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంగా ఐదు కోట్ల రూపాయలను మంజూరు చేశారని, బేగంపేట, రత్నాపూర్ గ్రామాల నుండి రామగిరి ఖిల్లాకు ఇరువై పులా రోడ్లు వేసి అభివృద్ధి చేయడం కొరకు, రామగిరి ఖిల్లా పై మౌలిక వసతులు కల్పిస్తామని, రామగిరి ఖిల్లా పై ఎన్నో ఔషధ మొక్కలు ఉన్నాయని, శ్రీరాముడు నడిచిన నేలగా ప్రసిద్ధి చెందిందని, ఇలాంటి పుణ్య క్షేత్రాన్ని అన్ని హంగులతో జాతీయ, అంత ర్జాతీయ స్థాయిలో ఈ క్షేత్రాన్ని అభివృద్ధి చేయడం కొరకు ప్రణాళికలు సిద్ధం చేసి నిధులు మంజూరు కొరకు కృషి చేస్తానని మంత్రి అన్నారు.