06-03-2025 10:40:30 PM
ఉపవాస దీక్షకులకు బలవర్ధకమైన ఆహారం హలీం..
హైదరాబాద్ తరహాలో క్వాలిటీ సౌకర్యం..
జనాలను ఆకర్షిస్తున్న తారా హలీం..
కోదాడ (విజయక్రాంతి): రంజాన్ మాసంలో ఉపవాస దీక్షకులకు బలవర్ధకమైన ఆహారం హలీం అని తారా మేనేజ్మెంట్ ఎస్.కె హజర్ బాబా అన్నారు. గురువారం కోదాడ పట్టణంలోని తారా టీ స్టాల్ పక్కనే తారా హలీం సెంటర్లో కొనుగోలుదారులకు క్వాలిటీ హలీంను అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... హైదరాబాద్ తరహాలో క్వాలిటీ హలీమ్ ను ఏర్పాటు చేసి పౌష్టిక ఆహార పదార్థాలు ఉపయోగించి హాల్మినో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రంజాన్ మాసంలో ఉపవాస దీక్షకులే కాకుండా ఇతరత్రా ప్రజలు వచ్చి హలీంను ఆకర్షిస్తున్నారని తెలిపారు. ఇదే కాకుండా తారా 10 బ్రాంచ్ లలో కూడా కోదాడ నుండే సప్లై చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ,ఎస్టీ,బీసీ,ఓబీసీ, వ్యవస్థాపక అధ్యక్షుడు పందిరి తిరుపయ్య, తదితరులు పాల్గొన్నారు.