calender_icon.png 4 March, 2025 | 4:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రంజాన్ ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలి

04-03-2025 01:00:07 AM

జిల్లా అదనపు కలెక్టర్ నగేశ్

మెదక్, మార్చి 3(విజయక్రాంతి): పవిత్ర రంజాన్ కు ఏర్పాట్లను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ అధికారులు ఆదేశించారు. సోమవారం జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మెదక్ ఆర్డీవో రమాదేవి, జడ్పీ సీఈఓ ఎల్లయ్య, డీఎస్పీ ప్రసన్నకుమార్,తో కలిసి రంజాన్ మాసం పండుగ నిర్వహణ ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులు, శాంతి కమిటీ సభ్యులతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు.

ఈ నేపథ్యంలో పోలీస్, రెవెన్యూ, మున్సిపల్, వైద్యారోగ్య, ఆర్‌అండ్బీ, విద్యుత్, పౌరసరఫరాలు, తదితర శాఖల అధికారులతో పాటు పలువురు మత పెద్దలు పాల్గొని ఏర్పాట్ల విషయమై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో అన్ని ఏర్పాట్లను అధికారులు  సిద్ధం చేసి ఉంచాలన్నారు.

ఈద్గాల వద్ద తాగునీటి సౌకర్యాన్ని కల్పించాలన్నారు. తాగునీరు అవసరమైన చోట్ల అదనంగా  నీటి ట్యాంకర్ ను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు. మసీదుల వద్ద చెత్త డబ్బాలను ఖచ్చితంగా ఏర్పాటు చేయాలని, ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య నిర్వహణలో భాగంగా పరిశుభ్రతా చర్యలు చేపట్టాలన్నారు. ఈ సమన్వయ సమావేశంలో మెదక్ ఆర్డిఓ రమాదేవి, మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి జమ్మల నాయక్, మునిసిపల్ కమిషనర్స్, సంబంధిత ఇతర శాఖల అధికారులు మత పెద్దలు పాల్గొన్నారు.