calender_icon.png 27 March, 2025 | 7:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అధికారికంగా జరుపుతున్న పండుగ రంజాన్..

23-03-2025 08:47:44 PM

ఇఫ్తార్ విందులో పాల్గొన్న పోచారం..

బాన్సువాడ (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరుపుతున్న పండుగ రంజాన్ అని రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదివారం సాయంత్రం కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణ కేంద్రంలోని శ్రీనివాస గార్డెన్స్ లో రాష్ట్ర ప్రభుత్వం తరపున ముస్లిం సోదరులకు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు హాజరై మాట్లాడారు. ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ముస్లిం సోదరులు భక్తిప్రపత్తులు, ఏకాగ్రత, ఆత్మను క్రమ పద్ధతిలో ఉంచుకొని క్రమశిక్షణతో ఉపవాస దీక్షలు కొనసాగిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు, బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, బాన్సువాడ పట్టణ మండల నియోజకవర్గ ముఖ్య నాయకులు, ముస్లిం సోదరులు పాల్గొన్నారు.