calender_icon.png 28 March, 2025 | 3:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐక్యతకు ప్రతీక రంజాన్

21-03-2025 12:57:32 AM

ఐటీశాఖ మంత్రి శ్రీధర్ బాబు

కాటారం, మార్చి 20 (విజయక్రాంతి): హిందూ, ముస్లిం ఐక్యతకు ప్రతీకగా రంజా న్ పండుగను నిర్వహించుకుంటామని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. గురువారం జయశంకర్ భూపాల పల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలోని బీఎల్‌ఎం గార్డెన్ లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

శ్రీధర్ బాబుతో పాటు జిల్లా కలెక్ట ర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరే ప్రభాకర్, కాటారం సబ్ కలెక్టర్ మయాన్క్ సింగ్, తాసిల్దార్ నాగరాజు ఇఫ్తార్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు ముస్లిం సోదరులకు, కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం రంజాన్ ప్రార్థన లు నిర్వహించారు. శ్రీధర్ బాబు మాట్లాడు తూ.. ముస్లింల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభు త్వం కట్టుబడి ఉందన్నారు. రాష్ట్రంలో ముస్లింల సంక్షేమం, అభివృద్ధి కోసం కాంగ్రెస్ కృషి చేస్తోందని, బడ్జెట్లో అధిక మొత్తంలో నిధులు కేటాయించినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో కాటారం, మహదేవపూర్, మహా ముత్తారం, పలిమల మండలాలకు చెం దిన నాయకులు పాల్గొన్నారు.