calender_icon.png 3 April, 2025 | 1:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మత సామరస్యానికి ప్రతీక రంజాన్

01-04-2025 12:55:58 AM

మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు

మెదక్ పట్టణంలోని పలు ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు 

మెదక్, మార్చి 31(విజయ క్రాంతి):మత సామర స్యానికి ప్రతీక రంజాన్ పండుగ అని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ అన్నారు. సోమవారం రంజాన్ పర్వది నాన్ని పురస్కరించుకొని మెదక్ పట్టణంలోని నవాపేట, గాంధీనగర్ లోని ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు పూలగుచ్చం అందజేసి స్వాగతం తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పవిత్రంగా నలపై రోజుల పాటు ఉపవాస దీక్షలతో ఉంటూ రంజాన్ మాసంను పూర్తి చేసుకోవడం విశేషమన్నారు. అనంతరం ముస్లీం మత పెద్దలకు, కార్యకర్తలకు, నాయకులకు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బొజ్జ పవన్, తాజా మాజీ మున్సిపల్ చైర్మెన్ తొడుపునూరి చంద్రపాల్, తాజా మాజీ కౌన్సిలర్ లు దొంతి లక్ష్మి ముత్యం గౌడ్, దాయర రాజలింగం, బట్టి జగపతి, అరునార్తి వెంకటరమణ,  బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హపీజ్ మోల్సాబ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మెన్ మేడి మధుసూదన్ రావు, సమీ, లక్ష్మినారాయణ గౌడ్, దుర్గప్రసాద్, నిఖిల్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉమర్, తాహేర్, అంజద్, మైసన్, రిజ్వాన్, బాని, డిజె రితీష్, మున్నా, శివరామక్రిష్ణ, శ్రీను లతో పాటు ముస్లీం మత పెద్దలు పాల్గొన్నారు.