calender_icon.png 1 April, 2025 | 8:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మత సామరస్యానికి ప్రతీక రంజాన్

29-03-2025 12:17:25 AM

మంత్రి దామోదర్ రాజానర్సింహ

ఆందోల్ మార్చి 28 :ముస్లిం సోదరుల పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలో ఉండే  వారి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందు లో రాష్ట్ర వైద్య ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ, సైన్స్ టెక్నాలజీ  మంత్రి  దామోదర్ రాజానర్సింహ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ...రంజాన్ ఆత్మీయత, మత సామరస్యానికి ప్రతీక అని అన్నారు. జోగిపేట  స్థానిక ఓ ప్రైవేటు ఫంక్షన్ హల్ లో  ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో మంత్రి పాల్గొన్నారు. సామూహిక నమాజ్ అనంతరం ఉపవాస దీక్ష చేపట్టిన ముస్లింలకు ఫలహారాలు తినిపించి ఉపవాస దీక్ష విడిపించారు.ఇఫ్తార్ విందులలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.

రంజాన్ మాస విశిష్టతను కొనియాడారు. అన్ని మతాలు చెప్పేది ఒక్కటేనని, మనషులంతా సోదర భావంతో ఉండాలన్నారు. ఈకార్యక్రమంలో   మార్కె ట్ కమిటీ చైర్మన్ జగన్మోహన్ రెడ్డి, ఆర్ డి ఓ పాండు, తహసీల్దార్ విష్ణు సాగర్, డిప్యూటీ తాసిల్దార్ సాగర్ మధుకర్ రెడ్డి , ముస్లిం మైనారిటీ ప్రతినిధులు మీర్ గోరె ఆలీ, ముస్లిం మైనారిటీ సోదరులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.