22-03-2025 10:12:52 PM
ఎమ్మెల్సీ దండే విఠల్..
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ముస్లింలకు రంజాన్ మాసం ఎంత పవిత్రమైనదని ఎమ్మెల్సీ దండే విఠల్ అన్నారు. శనివారం మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని రోజ్ కార్డెన్ లో ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందుకు కలెక్టర్ వెంకటేష్ దోత్రే, అదనపు కలెక్టర్ దీపక్ తివారి, ఏ ఎస్ పి చిత్తారంజన్ తో కలిసి హాజరయ్యారు. రంజాన్ పండగను పురస్కరించుకొని ఉపవాస దీక్ష సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ... పండుగలు మత సామరస్యానికి ప్రతీకగా నిలవాలని సూచించారు. అన్ని మతాల పండగలను గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ మైనార్టీ సంక్షేమ అధికారి రమాదేవి, సింగిల్ విండో చైర్మన్ అలిబిన్ హైమద్, నాయకులు అబ్దుల్లా, తారీక్ తదితరులు పాల్గొన్నారు.