calender_icon.png 22 March, 2025 | 8:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే రంజాన్

22-03-2025 12:00:00 AM

ముస్లింలకు రంజాన్ మాసం పవిత్రమైనది ఎమ్మెల్యే కె.ఆర్.నాగరాజు

హనుమకొండ, మార్చి21 (విజయ క్రాంతి): ఈరోజు హనుమకొండలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు సహృదయ అనాధ వృద్ధాశ్రమం నిర్వాహకులు, సేవా తత్పరుడు & కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ రాష్ట్ర నాయకులు మహమ్మద్ చోటు రూపొందించిన ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపే వాల్ పోస్టర్ను  వద్దన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజు ఆవిష్కరించారు.

ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రమశిక్షణ,  దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే రంజాన్ మాసం. ముస్లింలు చంద్రమాన క్యాలెండర్ ను అనుసరిస్తారు చంద్రమాన క్యాలెండర్ ప్రకారం వచ్చే ఈ రంజాన్ మాసంలోనే  ముస్లింల పవిత్ర గ్రంథమైన ఖురాన్ రాయబడింది. కావున రంజాన్ మాసం ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు అని అన్నారు.

ముస్లిం సోదర, సోదరీమణులు రంజాన్ మాసంలో అత్యంత భక్తిశ్రద్ధలతో పవిత్రంగా రోజా ఉం టారు. రోజా ఉన్న ముస్లింలు రంజాన్ మా సంలో అత్యంత నీతి నియమాలతో నిష్టతో కూడిన ఉపవాస దీక్షలో ఉండి అల్లాను ఆరాధిస్తారని తెలిపారు. ఈ నెలలో ముస్లిం లు భక్తిశ్రద్ధలతో ఉపవాస దీక్షలో ఉండి ఫిత్రా జకాత్ దానధర్మాలు చేస్తుంటారు.

పండుగలు మన జీవన స్రవంతిలో భాగమై మన జాతీయతను,  మన సంస్కృ తి వికాసానికి దోహదం చేస్తున్నాయి. పండుగ అనేది ఏ మతానికి సంబంధించినదైన సరే దాని వెనుక ఒక సందేశం దాగి ఉంటుందని, పండుగ మానవాళికి హితన్ని బోధి స్తుందన్నారు.

ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ చైర్మన్ నరుకుడు వెంకటయ్య,మాజీ జెడ్పీటీసీ కొత్తపల్లి, మాజీ సర్పంచ్ కమ్మగోని ప్రభాకర్ గౌడ్,ఎస్సీ సెల్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు తుళ్ళ రవి,కాజీపేట మండల అధ్యక్షుడు అనిల్ రెడ్డి,యూత్ కాంగ్రెస్ వర్ధన్నపేట మండల అధ్యక్షుడు ప్రతి బాను ప్రసాద్, జిల్లా నాయకులు నాంపెల్లి యాదగిరి, మహిళా నాయకురాలు తీగల సునీత గౌడ్, కర్ర శ్రీనివాస్ రెడ్డి, ఎండీ రషీద్ పాల్గొన్నారు.