calender_icon.png 26 March, 2025 | 3:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రంజాన్ తోఫాలు అందజేత

24-03-2025 07:23:53 PM

మంచిర్యాల (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధి మధుసూదన్ రెడ్డి సహకారంతో లయన్స్ క్లబ్ మంచిర్యాల ఆధ్వర్యంలో రంజాన్ పండుగను పురస్కరించుకొని ముస్లిం పేద కుటుంబాలకు రంజాన్ తోఫా కిట్ ని సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ... ముస్లిం సోదరులు రంజాన్ పర్వదినాన్ని సంతోషంగా జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు వి మధుసూదన్ రెడ్డి, దేవ రాజేశ్వర్, రాజన్న, మల్లారెడ్డి, హైమద్ తదితరులు పాల్గొన్నారు.