30-03-2025 10:56:49 PM
ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు పటేల్..
ఖానాపూర్ (విజయక్రాంతి): భారతదేశం భిన్న సంస్కృతులకు నిలయమని, మతసామరస్యానికి ప్రతీక రంజాన్ పండుగ అని, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు పటేల్ అన్నారు. ఆదివారం, ఖానాపూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు యూసుఫ్ ఖాన్ ఇచ్చిన ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొని మాట్లాడారు. అందరూ సోదర భావంతో పండగ సంతోషంగా జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు జహీర్, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం, అంకం రాజేందర్, వైస్ చైర్మన్ కావలి సంతోష్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మజీద్, కడాల గంగ నరసయ్య తదితరులు ఉన్నారు.